NATA Sydney Meet & Greet

సిడ్నీలో తెలుగువారి సంబరాలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొదటసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆస్ట్రేలియా సిడ్నిలోని తెలుగువారు సంబరాలు జరుపుకున్నారు. 
నవ్యాంధ్ర తెలుగు అసోసియెషన్ (నాటా ) ఆధ్వర్యంలో సిడ్నీలోని పారమట్ట పార్కులో గత ఆదివారం నాడు (05-03-17) ఉదయం 11 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు తెలుగు కుటుంబాలు ఆనందోత్సాహాలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు .
ముఖ్య అతిధిగా సిడ్నీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ , అపెక్స్ డెంటల్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ ఘంటసాల మహేష్ దీపం వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు .నాటా ఆధ్వర్యంలో నిర్వహించదలచిన కార్యక్రమాలను, లక్ష్యాలను ,సిడ్నీలో తెలుగుదనం ఉట్టిపడేందుకు తీసుకుంటున్న చర్యలను అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ గొల్లవిల్లి సూర్య సభ్యులకు వివరించారు. అలాగే సిడ్నీలో నివసించే తెలుగు వారికి నాటా అన్ని రకాలా సహాయసహకారాలు అందిస్తుందని శ్రీ సూర్య హామి ఇచ్చారు. సిడ్నీలోని తెలుగువారంతా ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకుంటూ ఒకటిగా ముందుకు సాగాలని నాటా సిడ్నీ సలహాదారులు శ్రీ కోడూరి శ్యాంప్రసాద్, శ్రీ పెరవలి సువర్నరాజు పిలుపునిచ్చారు.
నాటా సిడ్నీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారికి మాత్రమే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, శ్రీలంక , మారిషస్ , సింగపూర్, మలేషియా మరియు సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నుంచి వచ్చి సిడ్నీలో స్థిరపడిన తెలుగువారి బాగోగులు కూడా చూసుకుంటున్నది.
నాటా అధ్యక్షులు శ్రీ తిపిరినేని ప్రసాద్ కాన్ బెర్ర లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నాటా కు సహాయసహకారాలు అందిస్తున్నారు. నాటా కార్యదర్శి శ్రీ వెంకట్ గణేష్, కోశాధికారి శ్రీ ఉప్పులూరి సందీప్ , కార్యవర్గ సభ్యులు శ్రీ గొల్లవిల్లి ఫణి, శ్రీ పులి చంద్రమోహన్, శ్రీ ఉప్పు రేణు మరియు శ్రీమతి గోనెల ఉష ఆధ్వర్యంలో వినోద కార్యక్రమములు, ఆటల పోటీలు జరిగాయి. చిన్నా పెద్దా అందరూ ఆటల పోటీలు వినోద కార్యక్రమలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది.
ఈ మొత్తం కార్యక్రమానికి నాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఘనంగా ఏర్పాట్లు చెసింది. ఆంధ్రా వంటకాలతో మధ్యాహ్నం భోజనాన్ని ఆహుతులు అందరూ ఆస్వాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *